బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్గల్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన కాలకుంట్ల వినోద్ కుమార్ (21), కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా మనస్థాపానికి గురై మార్చి 24న గడ్డి మందు తాగాడు. అనంతరం అతడిని చికిత్స కోసం లక్ష్మక్కపల్లి లోని ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మార్చి 31న మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి కాలకుంట్ల గాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.