సంగారెడ్డి జిల్లా టాపర్ వర్షిత

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా టాపర్ వర్షిత
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి, జిల్లాకు 6వ స్థానాన్ని తెచ్చిపెట్టారు. మొత్తం 28 మండలాల్లో 5 మండలాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 15 మండలాల్లో 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా బాలికలే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి ముందున్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ పాఠశాలకు చెందిన వర్షిత 954 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. గుమ్మడిదల మండలంలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్