సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడలోని గ్లోకెమ్ పరిశ్రమలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ఒక బ్లాక్‌లో మంటలు చెలరేగడంతో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎస్సై కృష్ణారెడ్డి పరిశీలించారు.