జహీరాబాద్: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

జహీరాబాద్ మండలం గోవింద్పూర్ శివారులో చెరుకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ జాదవ్ రమేష్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
