
దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలీసులకు సవాల్ విసిరిన దొంగ!
AP: బాపట్లలో ఒక విచిత్రమైన దొంగ పోలీసులకే సవాల్ విసిరాడు. యజమాని ఇంట్లో లేని సమయంలో చొరబడి టీవీ చూస్తూ, వంట చేసుకొని తిన్నాడు. అంతేకాకుండా గోడలపై అసభ్య పదజాలంతో పాటు "నన్ను పట్టుకుంటారా?" అని రాసి పోలీసులకు బహిరంగ సవాల్ విసిరాడు. బీరువా పగులగొట్టి నగదు దొంగిలించిన దొంగ, తన పేరు 'రజ్ రామ్' అని చెప్పుకుంటూ, ఇంట్లోని వస్తువులను చిందరవందరగా చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు ఆధారాలు సేకరించి, దొంగ కోసం గాలింపు ముమ్మరం చేశారు.




