జహీరాబాద్ లో హోతి(కే) వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ తాళాలు ఇస్తామని అధికారులు చెప్పిన మాట తప్పడంతో వెంటనే తాళాలు ఇవ్వాలని, ఇండ్లను అప్పజెప్పాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ళ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. అనంతరం 6 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పోలీసులు వారిని అడ్డగించారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయం ముట్టడించారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు.