ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

2141చూసినవారు
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో కితకి రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయమని, ఆమె ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు దత్తు, లక్ష్మణ్, రాజ్ కుమార్, శ్రీశైలం, రాములు, శ్రీనివాస్, అంబన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్