చేయూత పింఛన్ల అర్హత పరిశీలన: 32 మందికి అధికారులు ఇంటింటి తనిఖీ

0చూసినవారు
చేయూత పింఛన్ల అర్హత పరిశీలన: 32 మందికి అధికారులు ఇంటింటి తనిఖీ
కోహిర్‌ మండలంలోని గురుజువాడ గ్రామంలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 32 మంది అర్హతలను అధికారులు మంగళవారం ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ప్రత్యేక అధికారి, ఏఈ మమత ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల కుటుంబ పరిస్థితులు, పత్రాలు, అర్హతలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సర్పంచ్‌ ప్రియాంక రాజేందర్‌ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ సాయికుమార్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్