
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి
TG: గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్ నగర శివారులో అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని గంజాయి ముఠా కారుతో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఘటన జరిగిన రోజే పోలీసులు వాహనాన్ని వెంబడించి ఇద్దరిని అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.




