తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకురానుంది. ఇప్పటివరకు సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది. ఇకపై, బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న మహిళ మరణిస్తే, ఆ రుణాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. దీనితో పాటు, సభ్యురాలికి రూ.10 లక్షల బీమా సొమ్మును కూడా ప్రభుత్వం అందించనుంది. ఈ కొత్త పథకం డ్వాక్రా మహిళలకు ఆర్థిక భద్రత కల్పించనుంది.