పొలం బడిలో రైతులకు సాగుపై అవగాహన

2చూసినవారు
పొలం బడిలో రైతులకు సాగుపై అవగాహన
జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలం సిద్దాపూర్ గ్రామంలో పొలం బడి శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త రమేష్, ఏఈఓ సుకుమార్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వానాకాలం సీజన్లో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, పురుగుమందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే విధానాలను క్షేత్రస్థాయిలో సూచించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, సర్పంచ్, సొసైటీ వైస్ చైర్మన్, గ్రామ ప్రజలు, రైతులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్