ఎల్నినో ప్రభావంతో రైతుల విలవిల

496చూసినవారు
ఎల్నినో ప్రభావంతో రైతుల విలవిల
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సీజన్లో వేసిన పంటలన్నీ సరైన వర్షాలు పడకపోవడంతో ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు పడకపోతే తీవ్రమైన ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అనుభవజ్ఞులు అంటున్నారు. అంతేగాక నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దానికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. వ్యవసాయం పైన ఆధారపడ్డ రైతులు, రైతు కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో ఎండిపోతున్న పంటలను చూసి తలలు పట్టుకొని బాధపడుతున్నారు.

సంబంధిత పోస్ట్