సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామస్తులు రాత్రి వేళల్లో తమ గ్రామానికి వెళ్లే దారిలో అడవి జంతువుల భయంతో ఇబ్బందులు పడుతున్నారు. సదాశివపేట నుంచి గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉండగా, దారిలో వీధి దీపాలు లేకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.