న్యాల్‌కల్‌లో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

3చూసినవారు
న్యాల్‌కల్‌లో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
న్యాల్‌కల్‌ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వారి చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం నూతన వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)గా కావ్య బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్‌ జ్యోతిలక్ష్మి–ప్రవీణ్‌ కుమార్‌ ఆమెకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సరోజ–ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్