ఝరాసంఘం మండలం భర్తీపూర్ లోని దత్తగిరి ఆశ్రమంలో ఈనెల 15వ తేదీన వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు సిద్దేశ్వర నంద మహారాజ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి 200 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.