కోహీర్: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

2చూసినవారు
కోహీర్: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కోహిర్ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో కోహిర్ ఎంఈఓ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా భవిత కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో ఫిజియోథెరపీతో పాటు బోధన కూడా అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా దివ్యాంగ విద్యార్థులకు మెరుగైన విద్య, శిక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్