కోహిర్ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 10,916 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 5,406 మహిళలు, 5,509 పురుషులు, ఒకరు ఇతరులు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5వ తేదీలోపు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.