జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా మంగళవారం మహా గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, కుంకుమ అర్చన, పూర్ణాహుతి నిర్వహించారు. గణపతి అనుగ్రహంతో ప్రజల జీవితాల్లోని ఆటంకాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టారు.