ఝారసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ కూడా పాల్గొన్నారు.