మొగుడంపల్లి మండల వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మహేష్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో గ్రామాల్లో సైతం ఆయన విగ్రహాల చిత్రపటాల వద్ద నివాళులర్పించడం సంతోషంగా ఉందని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.