జహీరాబాద్ లో మొహర్రం జాతర: కులమతాలకు అతీతంగా భక్తుల సందడి

1908చూసినవారు
జహీరాబాద్ లో మొహర్రం జాతర: కులమతాలకు అతీతంగా భక్తుల సందడి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని తకియ ఆవరణలో మొహర్రం నెల 5వ తేదీ నుంచి ఘనంగా జాతర కొనసాగుతోంది. ముఖ్యంగా మొహర్రం 10, 11 తేదీలలో హజ్రత్ హుస్సేని బాష, హజ్రత్ జిల్ఫేఖర్ అలీ పీర్లను ఊరేగించి, హజ్రత్ సయ్యద్ బుర్హాన్ అలీషా, చాంద్ పీర్ల ఆవరణలో ముగింపు జరుగుతుంది. 11వ తేదీన హజ్రత్ సయ్యద్ బుర్హాన్ అలీషా దర్గా ఆవరణలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్