రాయికోడ్ ఎంఈఓగా నర్సింలు బాధ్యతలు స్వీకరణ

0చూసినవారు
రాయికోడ్ ఎంఈఓగా నర్సింలు బాధ్యతలు స్వీకరణ
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల విద్యాధికారి (ఎంఈఓ)గా నర్సింలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంఈఓ మానయ్య పదవీ విరమణ పొందడంతో, కర్చల్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న నర్సింలును డీఈఓ వెంకటేశ్వర్లు ఈ పదవిలో నియమించారు. నర్సింలు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్