న్యాల్కల్: వరసిద్ధి ఆలయంలో మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు

న్యాల్కల్ మండలం రేజింతల్ వరసిద్ధి దేవాలయంలో గురువారం జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో మాజీ ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఆలయ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు బీబీ పాటిల్ తెలిపారు.
