
ముస్లిం యువకుడి హనుమాన్ దీక్ష
TG : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యూసఫ్ అనే ముస్లిం యువకుడు 11 రోజుల పాటు హనుమాన్ దీక్షను నియమనిష్టలతో కొనసాగించి, మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. జయంతి సందర్భంగా కొండగట్టుకు వెళ్లి మాల విరమణ చేసిన యూసఫ్, గత సంవత్సరం యాక్సిడెంట్ నుంచి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నానని, శ్రీరాముని కృపతో బ్రతికాననే విశ్వాసంతో ఈ దీక్ష చేపట్టినట్లు వెల్లడించాడు. అన్ని మతాలు సమానమేనని సందేశం ఇచ్చిన యూసఫ్, మతాలకు అతీతంగా మాలధారణపై ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు.




