న్యాల్కల్ మండల తహసీల్దార్ ప్రభులు పదవీ విరమణ సందర్భంగా గురువారం ఫంక్షన్ హాల్లో ఘనంగా పదవీ విరమణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభులు, ఆయన సతీమణి సరోజినిని అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సహచరులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కొద్దిసేపు మాట్లాడి ప్రభులు ప్రభుత్వ సేవల్లో అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం ఆయనకు అభినందనలు తెలిపారు.