సిద్దాపూర్ శివారులో పేకాటరాయుళ్లు పట్టివేత, నగదు, ఫోన్లు స్వాధీనం

సంగారెడ్డి జిల్లా, కోహిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దాపూర్ గ్రామ శివారులో శనివారం పేకాట ఆడుతున్న పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్చల్మ గ్రామానికి చెందిన వీరు గుట్టుగా పేకాట ఆడుతుండగా, సమాచారం అందుకున్న కోహిర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 10,640 నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘీక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నరేష్ హెచ్చరించారు. నిందితులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
