విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 30న నిరసనలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డిలోని సంఘ భవనంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ఆయా డివిజన్ కేంద్రాలతో పాటు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.