గురుజువాడలో సర్పంచ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం

1765చూసినవారు
గురుజువాడలో సర్పంచ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలంలోని గురుజువాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రియాంక రాజేందర్ మాట్లాడుతూ రెండు చుక్కలు.. జీవితాంతం రక్షణ" అనే నినాదాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని, ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్