ఝరసంఘంలో పల్స్ పోలియో కార్యక్రమం: పిల్లలకు చుక్కలు పంపిణీ

1510చూసినవారు
ఝరసంఘంలో పల్స్ పోలియో కార్యక్రమం: పిల్లలకు చుక్కలు పంపిణీ
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరసంఘం మండల కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి - శివమణి ఆధ్వర్యంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్