జహీరాబాద్ పట్టణ పరిధిలో నాలుగు వేర్వేరు అదృశ్య ఘటనలకు సంబంధించి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అల్లిపూర్, శాంతినగర్, రామనగర్ ప్రాంతాలకు చెందిన యువతులు, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన యువకుడు, జహీరాబాద్ మండలం బుర్దిపాడుకు చెందిన సురేందర్ (41), పటాన్ చెరులో ఇద్దరు, మిరుదొడ్డిలో ఒకరు మొత్తం ఎనిమిది మంది ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. ఈ అన్ని ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.