
ఈ ఆలయంలో రాతి స్తంభాలను తాకితే సంగీతం వినిపిస్తుంది (వీడియో)
విజయనగర సామ్రాజ్య కళా వైభవానికి ప్రతీక కర్ణాటక హంపిలోని విజయ విట్టల ఆలయం. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని రాతి స్తంభాలను తాకితే ‘సప్తస్వరాలు’’ వినిపిస్తాయి. సంగీత వాయిద్యాల శబ్దాన్ని పలికించే ఈ అద్భుత శిల్పకళా చాతుర్యం వెనుక ఉన్న రహస్యం నేటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విషయమే. నాటి శిల్పుల మేధస్సుకు, భారతీయ చారిత్రక వారసత్వానికి ఈ ‘సంగీత స్తంభాలు’ ఒక అద్భుత నిదర్శనం.




