న్యాల్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానం, బస్టాండ్ ప్రాంగణం, ప్రధాన రహదారుల పక్కన పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని నివారించేందుకు గడ్డి మందు పిచికారీ కార్యక్రమం ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమం న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి – ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దోమలు, విషపురుగుల బెడద తగ్గించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.