సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికులు తమ బకాయిలు చెల్లించి, విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిరసన చేపట్టారు. కర్మాగారం గేటు ముందు టెంట్ వేసి బైఠాయించిన కార్మికులు, యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆందోళన, యాజమాన్యం వెంటనే స్పందించకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.