
బడ్జెట్ వేళ.. సామాన్యులకు షాకిచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు
కేంద్ర బడ్జెట్ వేళ సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.50 పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1740.50కి చేరుకుంది. అయితే, గృహ వినియోగదారులు వినియోగించే డొమెస్టిక్ (14.2కేజీల) వంటగ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.




