జహీరాబాద్‌లో ఉండాల్సిన సీడీపీఓ కార్యాలయం కవేలికి ఎందుకు?

0చూసినవారు
జహీరాబాద్‌లో ఉండాల్సిన సీడీపీఓ కార్యాలయం కవేలికి ఎందుకు?
జహీరాబాద్‌లో ఉండాల్సిన సీడీపీఓ కార్యాలయాన్ని అద్దె భవనం ఖర్చు కారణంగా కోహీర్ మండలం కవేలి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాలమైన ప్రభుత్వ భవనంలో సీడీపీఓ కార్యాలయం కొనసాగుతుండగా, అదే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం భవనాన్ని ఖాళీ చేయించి ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. చిన్నారులకు అనువైన సౌకర్యాలు లేని అద్దె ఇంటిలో అంగన్‌వాడీ కేంద్రం కొనసాగుతుండటంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్