జహీరాబాద్: పేద విద్యార్థులకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలి

74చూసినవారు
జహీరాబాద్: పేద విద్యార్థులకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలి
కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ డిమాండ్ చేశారు. మల్కాపూర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అశోక్, నాయకులు జయకుమార్, రజనీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్