నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. జహీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ కామేష్, ఎస్ ఈ శ్రీనాథ్ పాల్గొన్నారు.