జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అరెస్ట్

8చూసినవారు
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అరెస్ట్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జహీరాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం భారీ ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యే కె. మాణిక్ రావు, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే మాణిక్ రావు విమర్శించారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరినా కార్యకర్తలు నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మాణిక్ రావు, ఇతర నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్