Mar 10, 2026, 09:03 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి: పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళలు
Mar 10, 2026, 09:03 IST
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మహిళా దినోత్సవ సమావేశంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వ్యాపార రంగంలో రాణించేందుకు సహకారం అందిస్తానని ఆమె పేర్కొన్నారు.