
జగన్ను కలిసిన వైసీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డి
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలపై చెరుకుపల్లి ఎస్ఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తూ వైసీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తనపై జరిగిన దాడిలో గాయపడినట్లుగా జగన్కు చూపించారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై ప్రైవేట్ కేసు వేయాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ తరపున న్యాయ సహాయం చేస్తానని జగన్ కృష్ణార్జున రెడ్డికి భరోసా ఇచ్చారు.




