సంక్రాంతి సంబరం.. అక్కడ 'పసుపుల పండుగ'లో ఎద్దుల పోటీ

5858చూసినవారు
సంక్రాంతి సంబరం.. అక్కడ 'పసుపుల పండుగ'లో ఎద్దుల పోటీ
AP: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం, చంద్రగిరి, గుడిపాల మండలాల గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా 'పసుపుల పండుగ' లేదా 'ఎరు తాజువుడల్' పేరుతో ఎద్దులను పట్టుకునే సంబరాలు జరుగుతాయి. తమిళనాడు జల్లికట్టును పోలి ఉండే ఈ వేడుకల్లో యువకులు ఎద్దులను పరిగెత్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. కోమనాపల్లి, రామరెడ్డిగారిపల్లి, పల్లయ్యగారిపల్లి వంటి గ్రామాల్లో జరిగే ఈ సంబరాలకు తమిళనాడు, కర్ణాటకల నుండి ఎద్దులను తీసుకువస్తారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ పండుగను తమ సంస్కృతిలో భాగంగా జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్