సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు, పిండివంటలతో పాటు కోడి పందేలు కూడా ప్రజలను అమితంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాల క్రితం వ్యవసాయం కోసం ఆంధ్రలోని కోస్తా జిల్లాల నుంచి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయని సమాచారం.