సంక్రాంతి రష్.. హైదరాబాద్- విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు (VIDEO)

36చూసినవారు
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్–విజయవాడ హైవే అట్టుడికింది. వీకెండ్ కావడంతో కుటుంబాలతో కార్లలో బయల్దేరిన వారు భారీగా రావడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే తీవ్ర రద్దీ నెలకొంది. శనివారం సాయంత్రం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 12 గంటల్లోనే దాదాపు 70 వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. టోల్ బూత్‌ల సంఖ్య పెంచినా ట్రాఫిక్ జామ్ తప్పలేదు. నందిగామ వై జంక్షన్ వద్ద రోడ్డు పనులు, ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా రద్దీకి కారణమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్