TG: హరిబాబు హత్యకేసు నిందితుడు సంతోష్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. సంతోష్ ఈ నెల 17న నిజామాబాద్‌లో నడిరోడ్డుపై హరిబాబును హత్యచేశారు. యూట్యూబర్ వైష్ణని హత్యకు ప్రతీకారంగానే చంపినట్లు సంతోష్ ఓ వీడియోలో పేర్కొన్నారు. తల్లి, బంధువుల సహకారంతో హరిబాబును హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు కర్రలు, కారును పోలీలుసు స్వాధీనం చేసుకున్నారు.