TG: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో, మద్యపాన రహిత గ్రామం లక్ష్యంగా గ్రామసభ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మద్యం విక్రయించిన ఆరుగురి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ తొలగించారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ శాతబోయిన రాజు తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే రేషన్ కార్డు, కరెంటు, ఇతర సౌకర్యాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మద్యం అమ్మేది లేదని బాండు రాసుకుంటే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.