సర్పంచ్ ఎన్నికలు.. బాండ్ పేపర్ పై హామీల మేనిఫెస్టో(వీడియో)

0చూసినవారు
TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నిక వేళ పలువురు అభ్యర్థులు వినూత్నంగా మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం కాప్రాయిపల్లి గ్రామంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున కుక్కల మౌనిక పోటీ చేస్తోంది. ఆయితే ఆమె రూ.100 బాండ్ పేపర్ పై 15 హామీలతో కూడిన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. తనను గెలిపిస్తే ఆడపిల్ల పుడితే రూ.2 వేలు, తీజ్ పండుగకు రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు, అకాల మరణం చెందిన వారికి అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఇస్తానని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్