సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

536చూసినవారు
సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. పన్వేల్ తాలూకా చిఖలేలోని గ్రూప్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దీపాలి దత్తాత్రాయ్ టాండేల్ తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. తన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించి జూలై 26న అధికారులకు ఆమె మెమోరాండం సమర్పించారు. అధికారులు పట్టించుకోలేదు. దీంతో కుటుంబంతో సహా విషం సేవించారు. పోలీసులు వచ్చి వారిని కాపాడారు.

సంబంధిత పోస్ట్