8న ఇందిరాపార్క్ వద్ద 'సత్యాగ్రహ దీక్ష': ఆర్ కృష్ణయ్య

15చూసినవారు
TG: ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఉధృత పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెం. 9ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం HYD విద్యానగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. డిమాండ్ల పరిష్కారానికి జూలై 8న ఇందిరాపార్క్ వద్ద 'సత్యాగ్రహ దీక్ష' చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :