
ఢిల్లీలో కఠిన ఆంక్షలు.. ఆ వాహనాలకు నో పెట్రోల్
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 18 నుంచి సరైన PUCC లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వబడదు. BS-VI కంటే తక్కువ ప్రమాణాలున్న ఢిల్లీయేతర ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే కాలుష్యం పెరిగిందని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం ఢిల్లీలో AQI 377గా ఉంది.




