యెమెన్‌లోని అల్-జౌఫ్ ప్రావిన్స్ అల్-హజ్మ్‌లో ఓ జైలుపై సౌదీ అరేబియా వైమానిక దాడి చేసిందని హౌతీ రెబల్స్ ఆరోపించారు. ఈ దాడిలో 9 మంది ఖైదీలు మృతి చెందినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన పోరాటాల్లో పట్టుబడిన వారిని ఈ జైలులో ఉంచినట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై సౌదీ అరేబియా నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. ఇదే సమయంలో మోచాలో జరిగిన మరో వైమానిక దాడిలో 6 మంది మృతి చెందినట్లు మంగళవారం హౌతీ మీడియా తెలిపింది.